Home  »  TV News  »  బోనాల జాతరలో ఆ ఇద్దరు సీరియల్ యాక్టర్స్ ఎంగేజ్మెంట్

Updated : Jul 27, 2026

బోనాల జాతర స్పెషల్ షో త్వరలో స్టార్ మాలో ప్రసారం కాబోతోంది. దాని లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "సందడి, సంబరం, సంప్రదాయం. ఈ మూడు కలిపితే మా బోనాల జాతర" అంటూ ఇంట్రో చెప్పింది శ్రీముఖి. ఇక ఈ బోనాల జాతరను ఎప్పటిలాగే ఘనంగా జరిపించడానికి గోల్కొండ పెహల్వాన్స్ , హైదరాబాద్ ధగడ్స్,  సికింద్రాబాద్ షేర్ అంటూ బుల్లితెర మీద ఉన్న సెలబ్రిటీస్ అంతా వచ్చారు.

ఇక ఒక పర్సన్ పులి వేషంలో వచ్చేసరికి మీట్ సింహం అంటూ నటరాజ్ మాష్టర్ ని పరిచయం చేసింది. ఆయనేమో మీసాలు తిప్పుతూ వచ్చారు. "ఇవన్నీ నిజం అనుకుంటారా మాష్టర్ " అని అడుగుతున్నాడు అంటూ ఇమ్మానుయేల్ మీద తోసేసింది శ్రీముఖి. నేను అలా అనలేదు అంటూ ఇమ్ము చేతూలూపుతూ వచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 9 ఐనప్పటి నుంచి తల్లీ కొడుకులిద్దరూ ఒకే టీమ్ లో ఉంటారు " అని శ్రీముఖి చెప్పేసరికి అవినాష్ మధ్యలో వచ్చి ఎవరు ప్రియాంక జైన్ ఇమ్మానుయేల్ ఆ అంటూ అడిగాడు. ఇంతలో ప్రిన్సి వచ్చి డాక్టర్ బాబును హగ్ చేసుకుని భుజం మీద వాలిపోయింది. "బాబు గారు నేను బాలును తగులుకున్నట్టు అదేంటి మిమ్మల్ని తగులుకుంది " అని అడిగింది శ్రీముఖి.

ఇక ఈ బోనాల జాతరలో ముగ్గురు అమ్మవార్ల దగ్గర పెట్టిన సారె గెలుచుకునేది ఎవరో తెలుసుకోవడమే మా పోటీ అదే బోనాల జాతర అంటూ గోల్కొండ జగదాంబిక, సికింద్రాబాద్ లష్కర్ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర పెట్టిన సారెని చూపించారు. ఇక ఈ బోనాల జాతరలో ఒక స్పెషల్ సర్ప్రైజ్ ని చూపించింది శ్రీముఖి. "మీరు ఎంతగానో అభిమానించే ఆ సీరియల్ స్టార్స్ త్వరలో ఒక ఇంటి వారు కాబోతున్నారు " అంటూ చెప్పింది. ఇక ఆ పెళ్ళికొడుకు ఎవరో కానీ అమ్మాయి నుదిటిపై కిరీటం పెట్టి కాళ్లకు పట్టీలు తొడిగి వెలికి ఉంగరం పెట్టారు. అలాగే విల్ యు మ్యారి మీ అంటూ అడిగాడు. అంతా అవును పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. ఐతే వాళ్ళ ముఖాలను రివీల్ చేయలేదు. కాకపోతే నెటిజన్స్ ఐతే రిప్లై ఇస్తున్నారు. "అమూల్య గౌడ  నిరంజన్  - నిరుల్యా " అంటూ రిప్లైస్ ఇస్తున్నారు.  
 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.